YS Jagan : ఏపీ (AP) లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సోమవారం కొత్త జిల్లాలను ప్రారంభించారు జగన్ రెడ్డి (Jagan Reddy) .
అనంతరం జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు తెలిపారు. పాత 13 పాత జిల్లాలతో పాటు 13 కొత్త జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పటికే కొత్త జిల్లాలకు కార్యాలయాలు, కలెక్టర్లు, ఎస్పీలను ఎంపిక చేశారు సీఎం(YS Jagan). 26 జిల్లాల ఏపీ (Andhra Pradesh) రాష్ట్రంగా రూపుమాపుతున్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు, అధికారాలకు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. సీఎం జగన్ రెడ్డి (Jagan reddy) స్వయంగా జిల్లాల పేర్లను ప్రకటించారు. ఒక్కో జిల్లా పేరును ప్రస్తావించారు.
ప్రజలు, ఇతర వర్గాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే జిల్లాల ఏర్పాటు చేశామని ప్రకటించారు సీఎం (chief Minister). పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే కొత్త వాటిని తీసుకు వచ్చామన్నారు జగన్ రెడ్డి.
జనాభా ప్రతిపాదకన ఏపీ (AP) లో జిల్లాల ఏర్పాటు కావల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల 96 లక్షల మంది జనాభాకు అనుగుణంగా పాలన మరింత సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జగన్ రెడ్డి.
గతంలో 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మార్చడం జరిగిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఒక్కో జిల్లాకు 19 లక్షల 7 వేల మంది జనాభా ఉండేలా చూశామన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Also Read : ఏపీలో 26 జిల్లాల ఎస్పీలు వీరే