Sharad Pawar Party Symbol : పార్టీ గుర్తు ను అంగీక‌రించండి – ప‌వార్

ఉద్ద‌వ్ ఠాక్రేకు ఎన్సీపీ చీఫ్ సూచ‌న

Sharad Pawar Party Symbol : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీకి చెందిన చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. విల్లు, బాణం గుర్తును షిండే వ‌ర్గానికి కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై స్పందించారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్. ఇది ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం. ఒకసారి డెసిష‌న్ తీసుకున్నాక చ‌ర్చ‌కు అవ‌కాశం లేదు. దానిని అంగీక‌రించాల్సిందే.

కొత్త గుర్తును తీసుకోవడ‌మే మిగిలింద‌ని పేర్కొన్నారు శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar Party Symbol). ఈ మేర‌కు ఉద్ద‌వ్ ఠాక్రేకు సూచ‌న‌లు చేశారు. ఎన్నిక‌ల‌లో పార్టీ గుర్తు మారినంత మాత్రాన ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌న్నారు శ‌ర‌ద్ ప‌వార్. ప్ర‌జ‌లు కొత్త గుర్తును త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని స్ప‌ష్టం చేశారు ఎన్సీపీ చీఫ్‌.

ఇదిలా ఉండ‌గా మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి పార్టీ పేరు శివ‌సేన , పార్టీ గుర్తు విల్లు, బాణం ఇవ్వాల‌ని భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈసీఐ ప్ర‌క‌ట‌న త‌ర్వాత శ‌ర‌ద్ ప‌వార్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీని గురించి రాబోయే 15 రోజుల పాటు చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత జ‌నం త‌మ ప‌నుల్లో నిమగ్నం అవుతారు. దీని గురించి అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు శ‌ర‌ద్ ప‌వార్.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌న చిహ్నాన్ని రెండు ఎద్దుల నుండి చేతికి కాడితో మార్చు కోవాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ కొత్త గుర్తును ప్ర‌జ‌లు ఆద‌రించారు..ఇలాగే ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గానికి చెందిన కొత్త గుర్తును ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు శ‌ర‌ద్ ప‌వార్.

Also Read : కేసులు..వేధింపుల‌కు భ‌య‌ప‌డం

Leave A Reply

Your Email Id will not be published!