Anand Sai : ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆలయాన్ని తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం ఆనందంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట తర్వాత తనకు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రతి ఒక్కరు దర్శించుకునేలా దీనిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఆనంద సాయి.
కొండగట్టులో ఉన్న అర్చకులతో కలిసి మాస్టర్ ప్లాన్ పైన చర్చించడం జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా మూడు నాలుగు రోజులలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయుడి గుడికి వస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు ఆర్కిటెక్చర్ ఆనంద సాయి.
ఏకంగా 108 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. అన్ని వైపులా ఎక్కడి నుంచైనా విగ్రహం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆనంద సాయి.
ఇందులో భాగంగా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం జరిగేలా చూస్తామని చెప్పారు. నీటి , విద్యుత్ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటు లోకి తీసుకు వచ్చేలా చేస్తామని ఆలయ కమిటీ హామీ ఇచ్చిందన్నారు ఆనంద సాయి(Anand Sai).
ఇదిలా ఉండగా ఈనెల 14న సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి రానున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ కూడా చేపట్టారు. తాజాగా ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో కొండగట్టు ఆలయ అభివృద్దికి రూ. 100 కోట్లు ప్రవేశ పెట్టడంతో , ఆలయ మాస్టర్ ప్లాన్ పైన సమీక్ష చేపట్టారు. అంతకు ముందు ఆనంద సాయి ఆలయంలో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read : పఠాన్ పరేషాన్ సెన్సేషన్