Actor Ali Pawan Kalyan : ప‌వ‌న్ జాన్తా నై పోటీకి సై – అలీ

సినీ న‌టుడు షాకింగ్ కామెంట్స్

Actor Ali Pawan Kalyan : ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారు, ప్ర‌ముఖ సీనీ న‌టుడు అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశిస్తే తాను జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై(Actor Ali Pawan Kalyan)  వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. న‌గ‌రి లోని కొండ‌గ‌ట్టు సంక్రాంతి సంబురాల్లో మంత్రి రోజాతో క‌లిసి అలీ పాల్గొన్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జ‌గ‌న్ రెడ్డి ఉన్నంత దాకా ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌లో వైసీపీ గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు న‌టుడు అలీ. ఎక్కడి నుంచైనా పోటీ చేసినా తాను బ‌రిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాన‌ని, వెన‌క్కి తిరిగే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న ఏకైక రాష్ట్రం ఏపీనేన‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు జిమ్మిక్కులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యాజిక్కులు ప‌ని చేయ‌వ‌న్నారు. సినిమా వేరు రాజ‌కీయాలు వేరు అని స్ప‌ష్టం చేశారు అలీ(Actor Ali Pawan Kalyan) . రాజ‌కీయ ప‌రంగా అభిప్రాయ భేదాలు, ఆలోచ‌న‌లు వేర్వేరుగా ఉండ‌వ‌చ్చ‌ని అన్నారు.

పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు కింది స్థాయి వ‌ర‌కు చేరుతున్నాయ‌ని దీంతో జ‌నం జ‌గ‌న్ రెడ్డికి జేజేలు ప‌లుకుతున్నార‌ని అన్నారు. త‌మ‌ను అడ్డుకునే శ‌క్తి ఏ పార్టీకి, ఎవ్వ‌రికీ లేద‌న్నారు.

జ‌గ‌న్ రెడ్డి ద‌మ్మునోడ‌ని, ఆయ‌న‌ను త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా, విమ‌ర్శ‌లు గుప్పించినా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ నాయ‌కుడికి ఉంద‌న్నారు.

Also Read : ఆర్ఆర్ఆర్ కు మ‌రో పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!