Venkatesh : ఎఫ్-3 ప‌క్కా న‌వ్వుల న‌జ‌రానా

ఎఫ్ -2 కంటే ఎక్కువ వినోదం

Venkatesh  : ఎఫ్‌-2 కంటే ఎఫ్ -3 ఇంకా ఎక్కువ వినోదాన్ని పంచుతుంద‌న్నారు విక్ట‌రీ వెంక‌టేశ్(Venkatesh ). అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఎఫ్ -2 మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

భారీ సినిమాలను సైతం త‌ట్టుకుని వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వెంక‌టేశ్ తో పాటు వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా , మెహ‌రీన్ , ఈ సినిమాలో కూడా న‌టించారు. ప్ర‌దీప్, ప్ర‌గ‌తి, అన్న‌పూర్ణ‌, విజ‌య‌, ఆలీ, సునీల్ , రాజేంద్ర ప్ర‌సాద్ న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు ఎప్ప‌టి లాగే తారాగ‌ణం కంటిన్యూ అవుతున్నా కొత్త‌గా మ‌రికొంద‌రిని తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉండ‌గా క‌రోనా కార‌ణంగా కొంత ఆల‌స్య‌మైనా సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్త‌యింది.

దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిల‌వ‌నుంది. ఇదే స‌మ‌యంలో ఎఫ్‌-3 మూవీ పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, పాట‌ల‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. భారీ ఆద‌ర‌ణ చూర‌గొంది.

ఇక మూవీ మేక‌ర్స్ ఈనెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ఎఫ్‌-3ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

గ‌త సినిమాలో కంటే ఎక్కువ‌గా వినోదాన్ని పంచుతుందని అన్నారు విక్ట‌రీ వెంక‌టేశ్(Venkatesh ). ఇది ప్ర‌తి ఫ్యామిలీ క‌లిసి చూసేలా ఉంటుంద‌న్నారు.. ఈ చిత్రంలో తాను రే చీక‌టి ఉన్న పాత్ర చేశాన‌ని చెప్పారు.

ఈ చిత్రం ఫుల్ న‌వ్వు కునేలా చేస్తుంద‌న్నారు వ‌రుణ్ తేజ్. మీ అంద‌రికి ఎఫ్ 3 న‌చ్చుతుంద‌న్నారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ట్రైల‌ర్ లో కొద్ది సేపు మాత్ర‌మే న‌వ్వును చూపించామ‌ని కానీ సినిమా అంతా న‌వ్వులే ఉంటాయ‌న్నారు.

Also Read : ఎఫ్ 3 ట్రైల‌ర్ నవ్వుల పండుగ

Leave A Reply

Your Email Id will not be published!