Nidhhi Agerwal : ప‌వ‌ర్ స్టార్ తో న‌టించ‌డం అద్భుతం

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న‌టి నిధి అగ‌ర్వాల్

Nidhhi Agerwal : సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందారు క్రిష్. ఆయ‌న తీసిన‌వి కొన్నే చిత్రాలు అయిన‌ప్ప‌టికీ అవి విజ‌య‌వంతంగా న‌డిచాయి. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క్రిష్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం తీస్తున్నారు. దీనికి చారిత్రక నేప‌థ్యం ఉంది. ఇందులో న‌టిస్తున్న నిధి అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దిగ్గ‌జ న‌టుడు ప‌వ‌న్ కళ్యాణ్ తో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. త‌న జీవితంలో ఒక్క‌సారైనా ప‌వ‌ర్ స్టార్ తో న‌టించాల‌న్న కోరిక ఉండేద‌ని అది డైరెక్ట‌ర్ క్రిష్ ద్వారా నెర‌వేరింద‌న్నారు నిధి అగ‌ర్వాల్.

ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ప‌వ‌న్ , నిధితో(Nidhhi Agerwal) పాటు అర్జున్ రాంపాల్ న‌టిస్తున్నారు ఇందులో. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎంఎం కీర‌వాణి. ఛాయా గ్ర‌హ‌ణం జ్ఞాన శేఖ‌ర్. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎ.ఎం.ర‌త్నం స‌మ‌ర్పిస్తున్నారు. ఎ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు.

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , ఆదిత్య మీన‌న్ , శుభ‌లేఖ సుధాక‌ర్ , పూజిత పొన్నాడ‌, బాబి డియోల్ కూడా ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డం విశేషం.

Also Read : Sitara Donate : ప్రిన్స్ సితార కోటి విరాళం

 

Leave A Reply

Your Email Id will not be published!