Adani Row Parliament : పార్ల‌మెంట్ లో అదానీ వివాదం

స‌మావేశాల‌కు తీవ్ర అంతరాయం

Adani Row Parliament : భార‌తీయ దిగ్గ‌జ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ వ్య‌వ‌హారంపై గురువారం పార్ల‌మెంట్ లో భారీ ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది(Adani Row Parliament) . ఇప్ప‌టికే అమెరికా సంస్థ హిండెన్ బ‌ర్గ్ అదానీ గ్రూప్ సంస్థ త‌ప్పుడు లెక్క‌ల‌తో మోసం చేస్తోందంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి 36 పేజీల నివేదిక‌ను విడుద‌ల చేసింది.

దీని దెబ్బ‌కు అదానీ గ్రూప్ కు చెందిన షేర్లు భారీగా ప‌డి పోయాయి. దీంతో గౌతం అదానీ ప్ర‌పంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఉన్న‌ట్టుండి 11వ స్థానానికి ప‌డి పోయాడు. ఆయ‌న కంటే వెనుక ఉన్న రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముకేశ్ అంబానీ దాటేశాడు. కాగా అదానీ గ్రూప్ లో దేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు జీవిత బీమా సంస్థ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన వేల కోట్లు అదానీ గ్రూపులో(Adani Group) పెట్టుబ‌డులు పెట్టాయి.

భారీ ఎత్తున న‌ష్టం వాటిల్ల‌డంతో ప్ర‌జ‌ల‌కు చెందిన డ‌బ్బుల‌ను ప్రైవేట్ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటూ ఇవాళ పార్ల‌మెంట్ లో ఎంపీలు నిల‌దీశారు. దీని వెనుక రాజ‌కీయం ఏమిటో దేశానికి తెలియాల‌ని అన్నారు. అదానీ గ్రూప్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని ప్ర‌తిప‌క్షాల స‌భ్యులు కోరారు.

భార‌తీయ పెట్టుబ‌డిదారుల‌కు క‌లిగే న‌ష్టాన్ని చ‌ర్చించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప‌ట్టుప‌ట్టారు. ఇక బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్ర స‌ర్కార్ పై ఉమ్మ‌డి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు స‌మావేశం అయ్యారు.

Also Read : అదానీ గ్రూప్ కు దెబ్బ మీద దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!