Adani Row Opposition : ‘అదానీ’ స్కాంపై విచారణ జరగాలి
డిమాండ్ చేసిన ప్రతిపక్షాల నేతలు
Adani Row Opposition : అదానీ గ్రూప్ భారీ ఎత్తున స్కాంకు పాల్పడిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్ తప్పుడు లెక్కలతో ఇన్వెస్టర్లను మోసం చేస్తోందంటూ ఆరోపించింది. దీంతో స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది.
ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, ఎస్బీఐ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఇందులో లక్షలాది మంది భారతీయులకు చెందిన డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని , అదానీ గ్రూప్ సంస్థ చేసిన మోసం గురించి పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు(Adani Row Opposition) పట్టుపట్టాయి. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహారం, మోసంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గౌతం అదానీ మోసానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్ఐసీ , ఎస్బీఐ $100 బిలియన్లకు పైగా కోల్పోయినట్లు సమాచారం తమకు ఉందన్నారు ఎంపీలు.
ఇదిలా ఉండగా అదానీ స్టాక్ క్రాష్ పై పార్లమెంట్ లో చర్చించేందుకు తొమ్మిది పార్టీలు నోటీసులు ఇచ్చాయి. రాజ్యసభలో ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే , ఆప్ నేత సంజయ్ సింగ్ , బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్ లోక్ సభలో తీర్మానం ప్రవశే పెట్టారు.
Also Read : అదానీ మోసం ప్రతిపక్షాలు ఆగ్రహం