Parliament Adjourned : అదానీ మోసం ప్రతిపక్షాలు ఆగ్రహం
ఉభయ సభలు వాయిదా
Parliament Adjourned : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే 65 బిలియన్లకు పైగా అదానీ గ్రూప్ కు నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో అదానీ గ్రూప్ లో భారత దేశానికి చెందిన లక్షలాది మంది షేర్లు కలిగి ఉన్నారు. వేలాది మంది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు.
అంతే కాదు దేశంలోని ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసీ, ఎస్బీఐ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. దీంతో రోజు రోజుకు షేర్లు ఢమాల్ కావడంతో దిక్కుతోచని స్థితిలో పడి పోయింది అదానీ గ్రూప్. ఈ మొత్తం వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనికి స్పీకర్ ఒప్పుకోక పోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నేతలు గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్ లో సమావేశం అయ్యారు. దీనిపై తీవ్ర గందరగోళం చెలరేగడంతో పార్లమెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ , చైర్మన్. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర సర్కార్ పై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష నాయకులు సమావేశం అయ్యారు.
అదానీ గ్రూప్ మోసంపై చర్చించాలని పట్టు పట్టారు. ప్రతిపక్ష నాయకుడు , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు సమావేశం అయ్యారు(Parliament Adjourned). ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ , డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, జేడీయూ , శివసేన ,సీపీఎం ,సీపీఐ , ఎన్సీపీ , ఐయూఎంఎల్ , ఆప్ , కేరళ కాంగ్రెస్ పార్టీల నాయకులు హాజరయ్యారు.
Also Read : పార్లమెంట్ లో అదానీ వివాదం