Smriti Irani Scindia : ‘స్మృతీ..సింధియా’కు అదనపు శాఖలు
తప్పుకున్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ..ఆర్సీపీ సింగ్
Smriti Irani Scindia : కేంద్రంలో కొలువు తీరిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్ లు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది.
వారిద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లను కలిశారు.
అనంతరం తమ రాజీనామా లేఖలను సమర్పించారు. దీంతో వారు ఇప్పటి దాకా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శాఖలను కేంద్ర సర్కార్ ఇప్పటికే కేబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు.
ఈ మేరకు కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. మహిళా, శిశు అభివృద్ది శాఖ నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి(Smriti Irani Scindia) ఇప్పటి వరకు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నిర్వహిస్తూ వచ్చిన మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇక ప్రస్తుత కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాకు ఇప్పటి దాకా ఆర్సీపీ సింగ్ నిర్వహిస్తూ వచ్చిన ఉక్కు మంత్రిత్వ శాఖను కేటాయించారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రి పదవులు అద్భుతంగా నిర్వహించారంటూ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీలను ప్రత్యేకంగా అభినందించారు.
ఇక నఖ్వీ లేక పోవడంతో బీజేపీకి సంబంధించి రాజ్యసభలో ఏ ఒక్క ముస్లిం లేక పోవడం విశేషం.
Also Read : దిగ్గజాలకు కేంద్రం అరుదైన గౌరవం