Akhilesh Yadav : మోసానికి చిరునామా మోడీ స‌ర్కార్

ధ్వ‌జ‌మెత్తిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav : కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ఎస్పీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) . బుధ‌వారం ఖ‌మ్మంలో జరిగిన భార‌త రాష్ట్ర స‌మితి స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ ఆవిర్భావ స‌భ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌ని కితాబు ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నికైన రాష్ట్రాల‌ను టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.

ప‌దే ప‌దే కావాల‌ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటం పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని త్వ‌ర‌లోనే బీజేపీకి బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భార‌తీయ జ‌న‌తా పార్టీని త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. ఇవాళ ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా వ్యాపార‌వేత్తలు, కార్పొరేట్లు, ఇత‌ర బ‌డా బాబుల‌కు అప్పగించే ప‌నిలో మోదీ బిజీగా ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు.

జ‌నం క‌ళ్లు తెర‌వ‌క పోతే ఇబ్బందులు ప‌డ‌తారంటూ హెచ్చ‌రించారు. ప్ర‌తి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 10 వేలు కూడా భ‌ర్తీ చేయ‌లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో మోసం చేయడంలో మోదీ స‌క్సెస్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు అఖిలేష్ యాద‌వ్.

మోదీ త‌న దేశాన్ని త‌న స్వంత ఆస్తి లాగా అనుకుంటున్నారని మండిప‌డ్డారు. కేంద్రం ఆధ్వ‌ర్యంలో న‌డిచే ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ జేబు సంస్థ‌లుగా మార్చేలా చేశారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్వాకం కార‌ణంగా ఇప్ప‌టికే వంద‌లాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) .

Also Read : వికీపీడియాపై ఆధార ప‌డితే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!