Adhir Ranjan Chowdhury : రాష్ట్ర‌ప‌తికి చెబుతా వేరే వాళ్ల‌కు కాదు

అధిర్ రంజ‌న్ చౌద‌రి షాకింగ్ కామెంట్స్

Adhir Ranjan Chowdhury : తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి(Adhir Ranjan Chowdhury) షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను చేసిన వ్యాఖ్య‌లు ఒక‌వేళ బాధ పెట్టిన‌ట్లు ఉంటే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు.

కానీ ఆమె పేరుతో రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీల‌కు కానే కాద‌న‌ని అధిర్ రంజ‌న్ చౌద‌రి స్ప‌ష్టం చేశారు. ఎంపీ రాష్ట్ర‌ప‌తిని రాష్ట్ర‌ప‌త్ని అని అన‌డంతో రాద్దాంతం చెల‌రేగింది.

అయితే తన‌కు హిందీ అంత పెద్ద‌గా రాద‌ని, ఆ భాష‌లో తాను పూర్ అని చెప్పారు. మాట్లాడుతుండ‌గా రాష్ట్ర‌ప‌త్ని అని జారి పోయింది. నేను బెంగాలీని . హిందీ మాట్లాడే వ్య‌క్తిని కాదు.

దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న ఆమెను అవ‌మానించాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు. నా క‌ల‌లో కూడా అలా జ‌ర‌గ‌ద‌న్నారు. ఎవ‌రు ఏమిటో ఎలా వ‌చ్చారో త‌న‌కు తెలుస‌న్నారు.

నిత్యం రాజ‌కీయాలు చేసే వాళ్ల‌కు ఇది ఓ లెక్కా అని ప్ర‌శ్నించారు అధిర్ రంజ‌న్ చౌద‌రి. త‌ప్పు జ‌రిగింది. పొర‌పాటైంద‌ని చెప్పా. దానిని రాజ‌కీయం చేయాల‌ని చూడ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌న‌కు హిందీ అల‌వాటు లేద‌న్నారు. నా కామెంట్స్ తో రాష్ట్ర‌ప‌తి మ‌న‌సు నొచ్చుకున్నారంటూ వీరంటున్నారు. నేను స్వ‌యంగా క‌లుస్తాన‌ని చెప్పారు అధిర్ రంజ‌న్ చౌద‌రి.

ఒక‌వేళ తాను మాట్లాడి ఉంటే నేను అందుకు బాధ్యుడిని కానీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఎందుకు బాధ్యురాలు అవుతార‌ని ప్ర‌శ్నించారు. ఆమెకు దానికి ఏం సంబంధం అంటూ నిప్పులు చెరిగారు ఎంపీ.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి గొప్ప‌ది. అందులో గిరిజ‌నుడా, ఆదివాసీనా, బ్రాహ్మ‌ణుడా, ద‌ళితులా, బ‌హుజ‌నులా అని చూడ‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : కామెంట్స్ క‌ల‌క‌లం బీజేపీ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!