Adhir Ranjan Chowdhury : మేడం తప్పైంది మన్నించండి
తాను కావాలని అనలేదని పేర్కొన్న అధీర్ చౌదరి
Adhir Ranjan Chowdhury : భారత దేశంలోనే అత్యంత ఉన్నతమైన పదవిగా భావించే రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఎట్టకేలకు దిగి వచ్చారు.
ఈ మేరకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, ఆరోపణలు, విమర్శలు పెరుగుతూ రావడంతో ఆయన తలొగ్గక తప్ప లేదు. ఈ మేరకు శుక్రవారం ఓ సుదీర్ఘ లేఖ రాశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.
లోక్ సభ సాక్షిగా ఓ సందర్భంలో అధిర్ రంజన్(Adhir Ranjan) చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి ఆయన రాష్ట్రపత్ని అని పేర్కొన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు, సంకీర్ణ సర్కార్ ఒక్కసారిగా విరుచుకు పడింది.
బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ , స్మృతీ ఇరానీ అధీర్ రంజన్ చౌదరితో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు అధీర్ రంజన్ చౌదరి. తాను అన్నానని మీరు అనుకుంటే ఒక్క రాష్ట్రపతికి చెబుతాను తప్ప తన తో పాటు ఏమీ అనని సోనియా గాంధీని ఎలా క్షమాపణలు చెబుతారంటూ ప్రశ్నించారు.
లోక్ సభ వాయిదా పడింది. ఇవాళ కూడా తిరిగి ప్రారంభం అయ్యే సరికి మరోసారి గందరగోళం నెలకొంది. ఇవాళ మంత్రులు స్వయంగా రాష్ట్రపతిని కలిశారు.
తాజాగా ఎంపీ రాసిన లేఖలో మీరు కలిగి ఉన్న పదవిని వివరించేందుకు పొరపాటున తప్పు పదాన్ని ఉపయోగించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఎంపీ పేర్కొన్నారు.
Also Read : ప్రవీణ్ నెట్టారు హత్య కేసు ఎన్ఐఏకి అప్పగింత
Congress MP Adhir Ranjan Chowdhury tenders apology to President Droupadi Murmu over "Rashtrapatni" remark.
"…I assure you that it was a slip of the tongue. I apologise and request you to accept the same," reads his letter. pic.twitter.com/dM1shdVU2C
— ANI (@ANI) July 29, 2022