Aditya-L1 Mission : నింగి లోకి ఆదిత్య – ఎల్1
ఇస్రో ప్రయత్నం విజయవంతం
Aditya-L1 Mission : ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది. నిన్న చంద్రయాన్ -3ను సక్సెస్ ఫుల్ గా చంద్రుడి వద్దకు చేర్చి న ఇస్రో తాజాగా సూర్యుడి వద్దకు రాకెట్ ను పంపించింది. ఆదిత్య – ఎల్ 1 ఉపగ్రహం శనివారం నింగి లోకి దూసుకు వెళ్లింది.
Aditya-L1 Mission Started
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ ) నుంచి పీఎస్ఎల్వీ – సీ 57 వాహన నౌక ఆదిత్య – ఎల్ 1(Aditya-L1 Mission)ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.
ఆదిత్య – ఎల్ 1 ఉప గ్రహం 4 నెలల పాటు ప్రయాణిస్తుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ఎల్ 1 (లగ్ రేంజ్ ) పాయింట్ ను చేరుకోనుంది.
ఇదిలా ఉండగా 15 లక్షల కిలో మీటర్ల దూరం లోని ఈ ప్రదేశం లోకి భారత్ ఉప గ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుందని షార్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆదిత్య – ఎల్ 1 ఉపగ్రహంలో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా శాస్త్ర, విజ్ఞాన రంగంలో భారత దేశం ప్రపంచ స్థాయిలో పేరు పొందింది.
Also Read : Nara Lokesh : పంచాయతీ నిధుల దొంగ జగన్