Aditya Thackeray : షిండే సర్కార్ పై ఆదిత్యా ఆగ్రహం
ఇది పూర్తిగా సిగ్గులేని ప్రభుత్వం
Aditya Thackeray : శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే నిప్పులు చెరిగారు. మరాఠాలో కొలువు తీరిన షిండే, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఓ వైపు రుతు పవనాల తాకిడి తప్పక ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకని సహాయక చర్యలు చేపట్ట లేదని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేదా లేక ఉన్నా కూడా కావాలని నిర్లక్ష్యం చేశారా అని నిలదీశారు.
ఇదిలా ఉండగా తుపాను తాకిడికి మహా నగరం ముంబై విల విల లాడింది. భారీ ఎత్తున నీళ్లు చేరుకున్నాయి. రోడ్లు కాలువలను తలపింప చేస్తున్నాయి. కానీ సీఎం ఏక్ నాథ్ షిండే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) ఆరోపించారు. బొంబై మహా నగర పాలక సంస్థ (బీఎంసీ)లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడం వల్లనే ఇవాళ ముంబై అంతా నీళ్లల్లో చిక్కుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిత్యా ఠాక్రే.
అంతే కాదు అంధేరి లోని శివాజీ పార్క్ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొంది. సిగ్గు లేని తనం, అసమర్థత , అవినీతి చోటు చేసుకోవడం వల్లనే ఇవాళ ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు ఆదిత్యా ఠాక్రే. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : RGV Vyuham : ఆర్జీవీ ‘వ్యూహం’పై ఉత్కంఠ