Afghan Mosque Blast : ఆఫ్గనిస్తాన్ లో పేలుడు పలువురు మృతి
మత గురువుతో పాటు 18 మంది దుర్మరణం
Afghan Mosque Blast : ఆఫ్గనిస్తాన్ లో పేలుళ్లు ఆగడం లేదు. హెరాత్ లోని గుజర్గా మసీదులో(Afghan Mosque Blast) శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
ఈ సమయంలో ముస్లిం ప్రార్థనా స్థలాలు ముఖ్యంగా రద్దీగా ఉంటాయి. తాలిబాన్ అనుకూల మత గురువుతో పాటు పలువురు మరణించారు. ముజీబ్ రెహ్మాన్ అన్సారీ , ఆయన కాపలాదారులు, పౌరులు కొందరు మసీదు వైపు వెళుతుండగా చంపబడ్డారు.
ఈ విషయాన్ని హైరత్ పోలీస్ ప్రతినిధి మహమూద్ రసోలి తెలిపారు. ఎంత మంది చని పోయారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. అయితే మత గురువుతో పాటు మొత్త 18 మంది మరణించి ఉంటారని ప్రాథమిక అంచనా.
ఈ భారీ పేలుడు ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా 21 మంది గాయపడ్డారని ఆఫ్గన్ వైద్యులను ఉటంకిస్తూ ఏపీ నివేదిక వెల్లడించింది.
హెరాత్ అంబులెన్స్ సెంటర్ లోని అధికారి మహ్మద్ దౌద్ మొహమ్మది మాట్లాడారు. అంబులెన్స్ ల ద్వారా క్షతగాత్రులను నగరంలోని ఆస్పత్రులకు తరలించినట్లు స్పష్టం చేశారు.
తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. అన్సారీ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనపై దాడి చేసిన వారిని శిక్షిస్తామన్నారు.
రెహమాన్ జూన్ చివరలో గ్రూప్ నిర్వహించిన వేలాది మంది పండితులు, పెద్దలతో కూడిన సమావేశంలో తాలిబన్లను సమర్థించారు.
వారి పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడిన వారిని ఖండిస్తూ గట్టిగా మాట్లాడారు. తాలిబన్లు పవర్ లోకి వచ్చాక భద్రతను మరింత పెంచామన్నారు జబివుల్లా.
ఇటీవలి కాలంలో అనేక పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలన్నీ మసీదులలో చోటు చేసుకున్నాయి.
Also Read : పర్మినెంట్ వీసాలకు ఆస్ట్రేలియా ఓకే