Covid19 : దేశంలో 2,430 క‌రోనా కేసులు

రోజు రోజుకు త‌గ్గుతున్న కేసులు

Covid19 : దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నా ఒక్కోసారి పెరుగుతున్నాయి. రోజూ వారీగా చూస్తే గ‌త 24 గంటల్లో 2,430 కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం 2,378 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. శ‌నివారం నాటికి మొత్తం క‌రోనా(Covid19) మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,70935గా న‌మోదైంది.

ఇక రోజూ వారీ పాజిటివిటీ రేటు 1.1 శాతంగా ఉండ‌గా వారానికి అనుకూల‌త రేటు మాత్రం 1.07 శాతంగా ఉంద‌ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 26,618 వ‌ద్ద ఉంది. ఈ సంఖ్య మొత్తం కేసుల‌లో 0.06 శాతం. స్వ‌ల్పంగా క‌రోనా కేసులు త‌గ్గాయి.

ఇదిలా ఉండ‌గా జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా ఉంద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి దాకా మొత్తం 89.83 కోట్ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా గ‌త 24 గంట‌ల్లో 2,41,707 ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టి వ‌ర‌కు 219.27 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

అంత‌కు ముందు కోవిడ్ వ్యాక్సినేష‌న్ అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో జాతీయ కోవిడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ చేప‌ట్టింది. ముందు జాగ్ర‌త్త‌గా డోస్ ను ప్రోత్స‌హించేందుకు ఆను ఈ ఏడాది 2022 జూలై 15న ప్రారంభించింది కేంద్ర స‌ర్కార్. ఈ 75 రోజుల్లో 13.01 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ టీకా శిబిరాల‌ను నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది ఆరోగ్య శాఖ‌.

76.18 ల‌క్ష‌ల‌కు పైగా మొద‌టి డోస్ , 2.35 క‌ట్ల రెండో డోస్ అంద‌జేసినట్లు తెలిపింది.

Also Read : మోదీ పాల‌న‌లో దిగ‌జారిన భార‌త్ ర్యాంకు

Leave A Reply

Your Email Id will not be published!