Covid 19 : పెరిగిన క‌రోనా కేసుల‌తో ప‌రేషాన్

బూస్ట‌ర్ డోస్ వేసుకోవాలన్న కేంద్రం

Covid 19 :  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి ఇంకా ఇబ్బందుల‌కు గురి చేస్తూనే ఉంది. ప‌లు దేశాలు త‌మ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నాయి.

కొన్ని దేశాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఇక భార‌త దేశంలో అత్య‌ధికంగా కేసులు న‌మోదైనా రాను రాను త‌గ్గుకుంటూ వ‌చ్చాయి. దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల త‌యారీ చేస్తోంది.

ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్ లో ఉంది. ప‌లు దేశాల‌కు ఉచితంగా పంపిణీ చేసింది. మాన‌వ‌తా దృక్ఫ‌థంతో సాయం చేసింది. ఈ విష‌యాన్ని బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా ఇదే విష‌యమై ప్ర‌ధాన మంత్రి ఆదుకున్నార‌ని తెలిపారు.

తాజాగా దేశంలో క‌రోనా కేసులు(Covid 19)  స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,395 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

క‌రోనా నుంచి 6, 614 మంది బాధితులు కోలుకున్నార‌ని వెల్ల‌డించింది. మ‌హ‌మ్మారి దెబ్బ‌కు 19 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది.

తాజాగా కేసుల‌తో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636 కు చేరుకున్నాయ‌ని తెలిపింది. ఇందులో భాగంగా 4,39,00,204 మంది కోలుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త రెండున్న‌ర ఏళ్ల కాలంలో క‌రోనా కార‌ణంగా 5,28,090 మంది ప్రాణాలు కోల్పోయార‌ని స్ప‌ష్టం చేసింది. దేశంలో 50,342 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌.

రిక‌వ‌రీ రేటు 98.7 శాతం ఉందని తెలిపింది. ఇదిలా ఉండ‌గా క‌రోనా నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంది. ఇప్ప‌టికే మూడో డోస్ కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

Also Read : కొత్త ర‌కం వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్న‌ల్

Leave A Reply

Your Email Id will not be published!