Adesh Gupta : ఢిల్లీ బ‌ల్దియా మ‌ళ్లీ మాదే – బీజేపీ

ప్ర‌జ‌లు ఆప్ ను చీద‌రించుకున్నారు

Adesh Gupta : ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల పోలింగ్ కు సంబంధించి ఇంకా కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఆప్ స‌ర్కార్ కు భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్య హోరా హోరీగా పోటీ కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఆప్ వైపు చూస్తే ఫ‌లితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

ఆప్ , బీజేపీ రెండూ ఒకే స్థాయిలో కొన‌సాగుతుండ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం ఎంసీడీ ఎన్నిక‌ల్లో మొత్తం 250 వార్డుల‌కు పోలింగ్ జ‌రిగింది. 1,300 మంది బ‌రిలో ఉన్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ , ఎంఐఎంతో పాటు ఇత‌రులు కూడా పోటీ చేశారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పందించింది.

ఆప్ అనుకున్నంత‌గా ఏమీ లేద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ న‌గ‌ర పాలిక సంస్థ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ప్ప‌క విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా(Adesh Gupta). అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డాగా ఆప్ మారింద‌న్నారు. ప్ర‌జ‌లు ఆప్ ను న‌మ్మ‌ర‌ని అన్నారు.

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫ‌లితాల స‌రళి ప్ర‌స్తుతానికి మెల్ల‌గా కొన‌సాగుతోంద‌ని , త‌ప్ప‌నిస‌రిగా అంచ‌నాలు త‌ప్ప‌డం ఖాయ‌మ‌న్నారు ఆదేశ్ గుప్తా. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చెప్పే మాట‌ల‌న్నీ బూట‌క‌మ‌ని ప్ర‌జ‌లు నిరూపిస్తార‌ని ఆ న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు.

తాము ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను లేవ‌దీశామ‌ని, ఆప్ అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట పెట్టామ‌ని చెప్పారు. నాలుగోసారి వ‌రుస‌గా ఢిల్లీలో బీజేపీ పాగా వేయ‌డం ఖాయ‌మ‌న్నారు ఆదేశ్ గుప్తా.

Also Read : ఢిల్లీ బ‌ల్దియాలో బీజేపీ ఆప్ నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!