Capt Bana Singh : అగ్నిప‌థ్ స్కీం దేశానికి ప్ర‌మాదం – బానా సింగ్

ప‌ర‌మవీర చ‌క్ర అవార్డు గ్ర‌హీత షాకింగ్ కామెంట్స్

Capt Bana Singh : ప‌ర‌మ‌వీర చ‌క్ర అవార్డు గ్ర‌హీత బానా సింగ్(Capt Bana Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీం పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ ప‌థ‌కం వ‌ల్ల దేశానికి ఒరిగింది ఏమీ ఉండ‌ద‌న్నారు. సియాచిన్ యుద్దంలో ధైర్య సాహసాలు ప్ర‌ద‌ర్శించినందుకు గాను ప‌ర‌మ‌వీర చ‌క్ర పుర‌స్కారం అందుకున్నారు.

గ‌తంలో కూడా అగ్ని ప‌థ్ స్కీంను వ్య‌తిరేకించారు. భార‌త సైన్యంలో ఆయ‌న‌కు అపార‌మైన ఉంది. బానా సింగ్(Capt Bana Singh) లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపాయి.

ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ లేవ‌నెత్తారు. ప్ర‌ధాన మంత్రి వెంట‌నే అగ్నిప‌థ్ స్కీంను ర‌ద్దు చేయాల‌ని కోరారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ఇక బానా సింగ్ సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల దేశానికి తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆందోంళ‌న చెందారు. దేశాన్ని ర‌క్షించండి. అగ్నిప‌థ్ వ‌ల్ల ప్ర‌మాదం త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌న్నారు.

భార‌త దేశం సంక్షోభంలో ఉంది. దేశ ర‌క్ష‌ణ అత్యంత ప్రాముఖ్య‌తమైన‌ది. ఈ స‌మ‌యంలో యువ‌త‌ను నిరాశ‌కు గురి చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు బానా సింగ్. యువ‌త దేశ భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంది.

ర‌క్ష‌ణ రంగంలో కాంట్రాక్టు వ్య‌వ‌స్థ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని గుర్తించాల‌ని సూచించారు. అగ్నిప‌థ్ స్కీం అమ‌లు చేసే కంటే ముందు ప్ర‌జ‌ల‌తో మాట్లాడాల‌ని బానా సింగ్ కోరారు. యువ‌త‌లో ఆగ్ర‌హం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

Also Read : గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్

Leave A Reply

Your Email Id will not be published!