CM KCR : కుదేలవుతున్న వ్యవసాయ రంగం – కేసీఆర్
మరోసారి కేంద్రంపై సీఎం తీవ్ర ఆగ్రహం
CM KCR : సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రాను రాను వ్యవసాయ రంగం కుదేలవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా వసతులు, వనరులు కలిగిన భారత దేశం నిరాదరణకు గురవుతోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేసీఆర్(CM KCR) ప్రసంగించారు. మిగతా దేశాలన్నీ ఎలా డెవలప్ కావాలో ఆలోచిస్తున్నాయని, ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని కానీ భారత్ మాత్రం మరింత వెనక్కి వెళుతోందని మండిపడ్డారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఎన్నో ఏళ్ల పాటు అభివృద్దికి నోచుకోలేక పోయామన్నారు.
కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశానికే తలమానికంగా నిలిచామన్నారు. ఏదైనా సాధించాలంటే సంకల్ప బలంతో పాటు విజన్ కూడా ఉండాలన్నారు. కానీ ఎలాంటి విజన్ లేకుండా దేశాన్ని పాలిస్తున్న ఏకైక ప్రధాని ఒకే ఒక్కరు ఉన్నారని ఆయనే నరేంద్ర మోదీ అంటూ ఎద్దేవా చేశారు.
అక్రమార్కులు దేశం దాటి వెళ్లి పోయినా ఈ రోజు వరకు ఒక్కరిని కూడా భారత్ కు తీసుకు రాలేక పోయారని మండిపడ్డారు. వ్యాపారవేత్తలు, బడా బాబులు, పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని చివరకు షావుకార్లకు దేశాన్ని అప్పగించే పనిలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్(CM KCR).
చైనాలో 16 శాతం మాత్రమే భూమి ఉందని కానీ భారత దేశంలో 50 శాతానికి పైగా భూమి ఉందని కానీ దానిని సద్వినియోగం చేసుకునే సోయి ప్రధానికి లేకుండా పోయిందన్నారు సీఎం.
Also Read : కిషన్ రెడ్డిపై కేటీఆర్ కన్నెర్ర