AIADMK Tussle : పన్నీర్ సెల్వంకు కోర్టు బిగ్ షాక్
ఈపీఎస్ కు ఊరట లైన్ క్లియర్
AIADMK Tussle : అన్నాడీఎంకే పార్టీకి ఎవరు వారసులు అనే దానిపై ఉత్కంఠకు తెర పడింది. తమిళనాడు హైకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆ పార్టీ సీనియర్ నాయకుడు, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు.
పార్టీకి సంబంధించిన జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై స్టే విధించాలంటూ ఓపీఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఫైనల్ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కోఆర్డినేటర్ , జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే చట్ట ప్రకారం సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఓపీఎస్(AIADMK Tussle) వాదించారు.
దీనిని తోసి పుచ్చింది కోర్టు. ఇదిలా ఉండగా పార్టీకి సంబంధించి సాధారణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ఈపీఎస్ వర్గానికి అనుమతి ఇస్తూ జస్టిస్ కృష్ణన్ రామస్వామి సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు.
సమావేశంలో 2,500 కంటే ఎక్కువగా ఉన్న అనుకూల సభ్యులతో ప్రస్తుత ద్వంద్వ నాయకత్వ నమూనాను రద్దు చేయాలని, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ను ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నారు.
ఈ మీటింగ్ లో పన్నీర్ సెల్వం కోశాధికారి పదవిని కూడా తొలగించే అవకాశం ఉందన్నారు. కొత్తగా నియమితులైన ప్రెసిడియం చైర్మన్ పిలిచిన ఈ సమావేశం సాంకేతికంగా చట్ట విరుద్దమని, అందువల్ల ఆమోద యోగ్యం కాదని వాదించారు.
కాగా కోర్టు తీర్పుకు ముందు చెన్నై లోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల ఇరు వర్గాల మద్దతు దారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. పార్క్ చేసిన వాహనాలపై కూడా దాడికి పాల్పడ్డారు. పన్నీర్ కు షాక్ తగలడంతో పళనిస్వామికి లైన్ క్లియర్ అయ్యింది.
Also Read : జయలలిత వారసుడు ఎవరో