Karnataka Cabinet List : ఎనిమిది మందికి కేబినెట్ లో చోటు
కర్ణాటక లో ప్రమాణం..ప్రకటించిన ఏఐసీసీ
Karnataka Cabinet List : కర్ణాటకలో కొత్త కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ కసరత్తు చేసింది. ఏఐసీసీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఖరారు చేసింది అధిష్టానం. దళిత వాయిస్ ను వినిపిస్తూ వచ్చిన ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జి. పరమేశ్వరకు కూడా చోటు దక్కింది.
తాజాగా ప్రకటించిన మంత్రి వర్గంలో ఎనిమిది మందికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కొత్త కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో(Cabinet List) జి. పరమేశ్వర, కే హెచ్ మునియప్ప, జార్జ్ , ఎంబీ పాటిల్ , సతీష్ జార్కి హోళీ, ప్రియాంక్ ఖర్గే, రామ లింగా రెడ్డి, జహీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.
వీరిలో జి. పరమేశ్వర ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన ఎన్నికలు వెలువడిన వెంటనే ధిక్కార స్వరాన్ని వినిపించారు. దళితుడిని డిప్యూటీ సీఎంగా చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పరమేశ్వరను హై కమాండ్ బుజ్జగించింది. ఇక ప్రియాంక్ ఖర్గే ఎవరో కాదు ఆయన ఏఐసీసీ మల్లికార్జున్ ఖర్గే తనయుడు. కీలకమైన పాత్ర పోసించే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల అబిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read : KKR vs LGS IPL 2023