Manikrao Thackeray : మాణిక్యం అవుట్ మాణిక్ రావు ఇన్
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు
Manikrao Thackeray : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి దాకా ఆరోపణలు, విమర్శలు, రాజీనామాలు, అలకలు, బుజ్జగింపులతో సరి పోయింది. చివరకు సీనియర్లు ధిక్కార స్వరం వినిపించడంతో పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.
దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటి దాకా పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్ రావు ఠాక్రేను(Manikrao Thackeray) తెలంగాణకు ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించింది.
ఇక మాణిక్యం ఠాగూర్ ను గోవాకు పంపించింది. తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఠాగూర్ పై. ఇక మాణిక్ రావు ఠాక్రే కు అపారమైన అనుభవం ఉంది. ఆయన గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా , ఎమ్మెల్సీగా పని చేశారు. పీసీసీ చీఫ్ గా పని చేశారు గతంలో. ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.
ప్రధానంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దామోదర రాజనరసింహ, మధు యాష్కి గౌడ్ , జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క , వీహెచ్ హనుమంతరావు , తదితరులు ధిక్కార స్వరం వినిపించారు. దీంతో పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను పరిశీలకుడిగా పంపించింది.
గొడవ సద్దు మణగాలంటే ఠాకూర్ ను తప్పించడం తప్ప మరో మార్గం లేదని డిగ్గీ రాజా నివేదిక అందించడంతో మాణిక్ రావు ఠాక్రేను నియమించక తప్పలేదు.
Also Read : కేసీఆర్ పై కన్నెర్ర కోదండరాం దీక్ష