AICC Focus : నాలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్
24న ఏఐసీసీ కీలక సమావేశం
AICC Focus : ఈ ఏడాది 2023లో కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకమని చెప్పక తప్పదు. అంపశయ్యపై ఉన్న ఆ పార్టీకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో జీవం పోశారు. ఒక రకంగా తాను ఆక్సిజన్ గా మారారు. ఈతరుణంలో గుజరాత్ లో ఓటమి పాలైనా హిమాచల్ ప్రదేశ్ లో సత్తా చాటింది. కర్ణాటక లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. 224 సీట్లకు గాను 136 సీట్లు కైవసం చేసుకుంది కాంగ్రెస్ . అధికారంలో ఉన్న బీజేపీకి 65 సీట్లు మాత్రమే వచ్చాయి. జేడీఎస్ కు 19 సీట్లు దక్కాయి. గెలుపొందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
పార్టీకి అనూహ్య విజయం దక్కడంతో ఆ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ తరుణంలో దేశంలో త్వరలో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 24న తెలంగాణ, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ ,రాజస్థాన్ రాష్ట్రాల చీఫ్ లతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ పరంగా ఏం చేయాలనే దానిపై చర్చించనుంది పార్టీ.
ఈ సమావేశానికి ఏఐసీసీ(AICC) చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పీసీసీ చీఫ్ లను రావాల్సిందిగా పార్టీ ఆహ్వానం పలికింది. సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పార్టీ మీటింగ్ జరగడం విశేషం. కర్ణాటకలో సీఎం పోస్ట్ పై నెలకొన్న సందిగ్ధతకు తెర దించారు సోనియా గాంధీ. రాజస్థాన్ లో సచిన్ పైలట్ వర్సెస్ అశోక్ గెహ్లాట్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో నేతల మధ్య సయోధ్య లేదు.
Also Read : KTR