AICC Focus : సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు
ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ..కేసీ వేణుగోపాల్
AICC Focus : న్యూఢిల్లీ – రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయి చతికిల పడిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రూపంలో పవర్ చిక్కింది. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో 119 సీట్లకు గాను హస్తం పార్టీ 64 సీట్లు గెలుపొందింది. మిత్రం పక్షంగా సీపీఐ ఒక సీటులో పోటీ చేసింది. ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పటి దాకా పవర్ లో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితమైంది.
AICC Focus to Finalize Telangana CM
ఇక కింగ్ పిన్ గా మారాలని, తెలంగాణ రాష్ట్రాన్ని తమ చేతుల్లోకి తెచ్చు కోవాలని ప్లాన్ చేసిన భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో 8 సీట్లు తెచ్చుకుంది. ఇదే సమయంలో ఆ పార్టీకి ఓటు శాతం పెరిగింది. ఇక ఎంఐఎం ఎప్పటి లాగే తన పాత సీట్లను నిలుపు కోగలిగింది.
ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలే తెలంగాణలో కూడా చోటు చేసుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది అభ్యర్థులతో సమావేశం జరిగింది. పరిశీలకులుగా డీకే శివకుమార్ ఉన్నారు. మీటింగ్ అనంతరం డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. సీఎం ఎంపిక వ్యవహారం ఏఐసీసీ(AICC) చూసుకుంటుందని, తమ పార్టీ చీఫ్ ఖర్గే ప్రకటిస్తారని తెలిపారు.
దీంతో సీన్ హస్తినకు మారింది. ఇవాళ రాత్రి వరకు అభ్యర్థిని ఖరారు చేస్తామని ప్రకటించారు ఖర్గే. దీంతో ఆయన నివాసానికి మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీకే శివకుమరా్, ఖర్గే చేరుకున్నారు. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
Also Read : AP Rain : భారీ వర్షం అంతటా అస్తవ్యస్తం