Jyotiraditya Scindia : విమాన ఛార్జీలను నియంత్రించలేం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా
Jyotiraditya Scindia : చావు కబురు చల్లగా చెప్పారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia) . విమాన ఛార్జీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జీలను నియంత్రించడం తమ చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. కానీ పర్యవేక్షణ జరిపే అధికారం తమకు ఉంటుందన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
రోజూ వారీగా చూస్తే భారీ ఎత్తున ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. రాక పోకల పరంగా చూస్తే ఏకంగా 4.3 మిలియన్లు దాటిందన్నారు కేంద్ర మంత్రి. అయితే విమాన ఛార్జీలను నియంత్రించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు జ్యోతిరాదిత్యా సింధియా.
ఓ వైపు భారత దేశం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కూడా విమానయాన రంగం నష్టాల్లో లేక పోవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏది ఏమైనా భారత దేశంలో ఎయిర్ లైన్స్ వినియోగం పెరుగుతోందని చెప్పారు. విమానయాన రంగం కొత్త వృద్దికి దోహద పడుతోందన్నారు. వృద్ది అనేది శాశ్వతంగా ఉంటుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia) .
2019తో పోలిస్తే ఈ ఏడాది భారీగా ప్రయాణీకుల సంఖ్య పెరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రయాణీకులకు తగిన రీతిలో ఎయిర్ లైన్స్ ల సంఖ్య కూడా పెరిగిన విషయం గమనించాలని అన్నారు కేంద్ర మంత్రి. 2013-14లో 74 ఎయిర్ పోర్టులు ఉండేవని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 146కు చేరుకుందన్నారు.
రానున్న 4 లేదా 5 ఏళ్లలో ఈ సంఖ్య 200కు కూడా దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జ్యోతిరాదిత్యా సింధియా.
Also Read : కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందే