Air Lines Asked : అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులకు బిగ్ షాక్

వివ‌రాలు ఇవ్వాల‌ని ఎయిర్ లైన్స్ ల‌కు ఆదేశం

Air Lines Asked :  కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త దేశంలోని విమాన‌యాన సంస్థ‌ల‌కు కీల‌క‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అంత‌ర్జాతీయ ప్ర‌యాణ‌కుల సంప్ర‌దింపుల వివ‌రాల‌ను(Air Lines Asked)  త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ వివ‌రాల‌ను విధిగా క‌స్ట‌మ్స్ తో పంచుకోవాల‌ని ఆదేశించింది. ఇటీవ‌ల ఆర్థిక నేరాలు మ‌రింత పెరిగాయి. క‌స్ట‌మ్స్ చ‌ట్టం కింద నేరాల‌ను నిరోధించ‌డం , గుర్తించ‌డం, ద‌ర్యాప్తు చేయ‌డం, విచారించ‌డం ల‌క్ష్యంలో భాగంగా దీనిని అమ‌లులోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది కేంద్ర స‌ర్కార్.

ఇందులో భాగంగా ప్ర‌యాణీకుల నేమ్ రికార్డ్ స‌మాచారంలో పీఎన్ఆర్, రిజ‌ర్వేష‌న్ తేదీ, త‌దిత‌ర వివ‌రాలు పొందు ప‌ర్చ‌బ‌డి ఉంటాయి. ఆయా ప్ర‌యాణీకులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నార‌నే దానిపై స్ప‌ష్ట‌మైన వివ‌రాలు లేక పోవ‌డం వ‌ల్ల నేరాలు జ‌రిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతోంద‌ని భావిస్తోంది.

ఈ త‌రుణంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల పూర్తి స‌మాచారం అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

రిస్క్ అనాలిసిస్ ని పేర్కొంటూ క‌స్ట‌మ్స్ డిపార్ట్ మెంట్ తో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల వివ‌రాలు పంచు కోవ‌డం విమాన యాన సంస్థ‌లు విధిగా చేయాల‌ని ఆదేశించింది.

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ప‌రోక్ష ప‌న్నులు, క‌స్ట‌మ్స్ (సీబీఐసీ) ప్ర‌తి విమాన‌యాన సంస్థ ఇప్పుడు ప్రయాణీకుల నేమ్ రికార్డు వివ‌రాల‌ను జాతీయ క‌స్ట‌మ్స్ టార్గెటింగ్ సెంట‌ర్ ప్యాసింజ‌ర్ కి బ‌య‌లు దేరే స‌మ‌యానికి 24 గంట‌ల ముందు అందించాల‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో ప్ర‌యాణం మ‌రింత క‌ష్ట‌త‌రంగా మార‌నుంద‌న్న‌మాట‌.

Also Read : శ్రీ‌లంక ప‌ర్యాట‌క ప్ర‌చార‌క‌ర్త‌గా జ‌య‌సూర్య

Leave A Reply

Your Email Id will not be published!