Ajay Mishra : మార్గరెట్ అల్వా ఫోన్ ట్యాపింగ్ అబద్దం
ఆమె ఓడి పోయే అభ్యర్థి అంటూ కామెంట్
Ajay Mishra : తన ఫోన్ పని చేయడం లేదని , అంతే కాకుండా తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతిగా బరిలో ఉన్న మార్గెటర్ అల్వా(Margaret Alwa).
ఆమె చేసిన కామెంట్స్ ఇవాళ కలకలం రేపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని మాట్లాడారు. మార్గరెట్ అల్వా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
తన మొబైల్ లో కాల్ లు చేయడం లేదా స్వీకరించం లేదని ఆరోపించడాన్ని తప్పు పట్టారు. ఫోన్ లో ఏదో మిస్టేక్ జరిగి ఉండవచ్చు. లేదా ఆమెకు ఆపరేటింగ్ సిస్టం రాక పోయి ఉండవచ్చు.
కాదంటే ఫోన్ లోనే ఏదో ప్రాబ్లం ఉందోనన్న విషయం తెలుసు కోకుండా ఇలాంటి చౌకబారు విమర్శలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి. మార్గరెట్ అల్వా కాల్ లను స్నూపింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీశారు.
తన మొబైల్ లో కాల్స్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం లేదంటూ అల్వా చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేశారు. నిరాశకు గురైన వ్యక్తులు చేసే విమర్శలు ఇవి. ఆమెకు గెలిచే అవకాశాలు లేవు.
దీంతో ఏదో పనిగా భారతీయ జనతా పార్టీని, కేంద్రాన్ని ప్రజల్లో బద్నాం చేయాలని అనుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు అజయ్ మిశ్రా తేని(Ajay Mishra).
అయితే కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ పై మార్గరెట్ అల్వా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : నా ఫోన్ ను పునరుద్దరించండి – అల్వా