Ajit Mohan : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ (మెటా)కు కోలుకోలేని షాక్ తగిలింది. మెటా ఇండియా హెడ్ గా ఉన్న అజిత్ మోహన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్ బుక్ కు పేరెంట్ కంపెనీగా ఉంది మెటా. ఇటీవలే ఎఫ్బీని మెటాగా మార్పులు చేశారు. తాజాగా ఇండియా హెడ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
తన రిజైన్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అజిత్ మోహన్(Ajit Mohan) రాజీనామా చేసిన విషయాన్ని ఫేస్ బుక్ (మెటా) కంపెనీ ధ్రువీకరించింది. ఇదిలా ఉండగా తాను ఎందుకు తప్పుకుంటున్నాననే దానిపై వివరణ ఇవ్వలేదు. కాగా ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయంగా మరో సంస్థ స్నాప్ ఇటీవల జనాదరణ చూరగొంటోంది.
దీంతో అజిత్ మోహన్ మెటా నుంచి తప్పుకుని స్నాప్ లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2019 జనవరిలో ఫేస్ బుక్ లో చేరారు. భారత్ వరకు వచ్చే సరికి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ గా , మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు.
ఆయన సారథ్యంలో ఫేస్ బుక్ (మెటా)కు(Meta) పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడమే కాదు ఆ సంస్థకు చెందిన సొంత యాప్స్ ఇన్ స్టాగ్రామ్ , వాట్సాప్ లకు ఒక్క భారత్ లోనే 20 కోట్ల మందికి వినియోగదారులను చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు అజిత్ మోహన్.
భారీ ఎత్తున చేరడంలో సక్సెస్ కావడంతో ఇండియా మెటాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. అజిత్ మోహన్ కు వేరే కంపెనీలో భారీ ఆఫర్ రావడంతో మెటాను వీడినట్లు ఆ సంస్థ గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండాల్సన్ వెల్లడించారు.
Also Read : ఎవరైనా 12 గంటలు పని చేయాల్సిందే