Ajit Pawar : బీజేపీతో కలిసేందుకు పవార్ ప్రయత్నం
బాంబు పేల్చిన రెబల్ నేత అజిత్ పవార్
Ajit Pawar : అంతా ఊహించినట్లు గానే ఎన్సీపీ రెబల్ నేత, ప్రస్తుత మరాఠా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను టార్గెట్ చేశారు. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో దాదాపు మూడు సార్లు బీజేపీతో కలవాలని, మోదీతో దోస్తీ చేయాలని తహ తహ లాడారంటూ బాంబు పేల్చారు అజిత్ పవార్.
సర్కార్ ఏర్పాటు చేసేందుకు ఐదు సార్లు కాషాయంతో చర్చలు కూడా జరిపామని చెప్పారు. ఇదే సమయంలో పొత్తు ఉండదంటూ శరద్ పవార్ చెప్పారన్నారు. శివసేనతో కలిసి వెళుతున్నామని తెలిపారని పేర్కొన్నారు అజిత్ పవార్(Ajit Pawar).
ఇవాళ జరిగిన బల నిరూపణంలో సక్సెస్ అయ్యారు. 2019లో శరద్ పవార్ మనసు మార్చుకున్నారని చెప్పారు. ఇవాళ నేను చెప్పిన ప్రతి మాట వాస్తవమని అన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో కూడిన కాపీ నా వద్ద ఉందన్నారు అజిత్ పవార్. ఇదిలా ఉండగా శివసేనపై ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసిన సమయంలో ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా గంప గుత్తగా బీజేపీలో చేరాలని అనుకున్నారంటూ మరో బాంబు పేల్చారు అజిత్ పవార్.
ఇదిలా ఉండగా తాజాగా అజిత్ పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇచ్చారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆపై 24 మంది ఎమ్మెల్యేలతో జంప్ అయ్యారు. రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపై డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా ఈ ఎపీసోడ్ మరాఠా రాజకీయాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : Rahul Gandhi : మధ్యప్రదేశ్ ఘటనపై రాహుల్ ఫైర్