Ajmer Dargah Cleric : అజ్మీర్ ద‌ర్గా మ‌త గురువు అరెస్ట్

నూపుర్ శ‌ర్మపై షాకింగ్ కామెంట్స్

Ajmer Dargah Cleric : రాజ‌స్థాన్ లోని అజ్మీర్ ద‌ర్గాకు చెందిన మ‌త గురువును బుధ‌వారం అరెస్ట్ చేశారు. ప్ర‌వ్త‌క పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

నూపుర్ శ‌ర్మ త‌ల న‌రికి చంపిన ఎవ‌రికైనా త‌గిన బ‌హుమ‌తి ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

దీనిపై రాజ‌స్తాన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిన్న‌టి నుంచి స‌ల్మాన్ చిస్తీ కోసం వెతికారు. ఇదిలా ఉండ‌గా కామెంట్స్ చేసిన నూపుర్ శ‌ర్మ త‌ల‌ను త‌న వ‌ద్ద‌కు తీసుకు వ‌చ్చే వారు ఎవ‌రికైనా స‌రే త‌న ఇంటిని ఉచితంగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు ఈ మ‌త గురువు.

ప్ర‌వక్త‌ను అవ‌మానించినందుకు ఆమెను కాల్చి చంపేస్తానంటూ కూడా బ‌హిరంగంగా ప్ర‌క‌టించాడు ఈ చిస్తీ. మీరు అన్ని ముస్లిం దేశాల‌కు స‌మాధానం ఇవ్వాల‌న్నాడు. నేను రాజ‌స్తాన్ లోని అజ్మీర్ ద‌ర్గా(Ajmer Dargah Cleric) నుండి చెబుతున్నా.

ఈ సందేశం హుజూర్ ఖ్వాజా బాబా కా ద‌ర్బార్ నుండి అని వీడియోలో చెప్ప‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా నిందితుడికి నేర చ‌రిత్రుంద‌ని పోలీసు అధికారి ద‌ల్వీర్ సింగ్ ఫౌజ్జార్ తెలిపాడ‌ని పీటీఐ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా అజ్మీర్ ద‌ర్గా దేవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ కార్యాల‌యం ఈ వీడియోను ఖండించింది. ఈ మందిరం మ‌త సామ‌ర‌స్య ప్ర‌దేశ‌మ‌ని పేర్కొంది.

వీడియోలో ఖాదీం వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు ద‌ర్గా నుండి వ‌చ్చిన సందేశంగా ప‌రిగ‌ణించ లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌చారం – ఎన్ఐఏ

Leave A Reply

Your Email Id will not be published!