Akash Saxena Win : ఆజం ఖాన్ కోటలో బీజేపీ పాగా
చెప్పి మరీ ఓడించిన సీఎం యోగి
Akash Saxena Win : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేశాయి. నేతాజీగా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే ఓటర్లు మాత్రం మరోసారి తాము ఎస్పీ వైపే ఉన్నామని చాటారు. ఏకంగా భారీ మెజారిటీతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ను గెలిపించారు.
ఆమె మోమిన్ పుర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఇదే సమయంలో గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఆజం ఖాన్ కు చెందిన రాంపూర్ సదర్ లో బీజేపీ అభ్యర్థి ఘన విజయాన్ని నమోదు చేశారు. సమాజ్ వాది పార్టీ పోటీ పై బరిలో నిలిచిన ఆజం ఖాన్ అనుచరుడు ఆసిమ్ రజాపై భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి ఆకాశ్ సక్సేనా(Akash Saxena Win) గెలుపొందారు.
ఇదిలా ఉండగా సక్సేనాకు 62 శాతం ఓట్లు పోలైతే రజాకు కేవలం 36 శాతం మాత్రమే వచ్చాయి. ఒక రకంగా సమాజ్ వాదీ పార్టీకి ఈ నియోజకవర్గం కంచు కోట. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పీ మరీ ఓడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా విచిత్రంగా తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు ఆజమ్ ఖాన్.
ఆయన ఇక్కడ గెలుపొందారు కూడా. 2019లో విద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు ఆజం ఖాన్.
మొత్తంగా యోగీనా మజాకా అని ఇప్పుడు జనం అనుకుంటున్నారు. ఇప్పటికే యోగిని బుల్డోజర్ బాబా అని పిలుచుకుంటున్నారు. నేరస్థులకు చుక్కలు చూపిస్తున్నాడు సీఎం.
Also Read : ఎస్పీలో శివపాల్ యాదవ్ పార్టీ విలీనం