Akbaruddin Owaisi : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్
కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే
Akbaruddin Owaisi : హైదరాబాద్ – నిన్నటి దాకా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన ఎంఐఎంకు ఊహించని రీతిలో ఆఫర్ ఇచ్చారు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి. ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Akbaruddin Owaisi Got Good Offer
ఈ మేరకు ఆయనకు ఈ ప్రతిపాదనను పంపించారు. దీనిని తాను గౌరవంగా భావిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ.
తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లకు పైగా అవుతోంది. ప్రస్తుతం పదేళ్ల పాటు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సీఎంగా పాలన సాగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన మెజారిటీతో సర్కార్ ను ఏర్పాటు చేసింది.
సీఎంతో పాటు మరో 11 మందికి కేబినెట్ లో చోటు కల్పించారు. ఎన్నికైన ఎమ్మెల్యేలతో 3వ శాసన సభలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మల్యేగా అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) ఉన్నారు.
తాను ప్రొటెం స్పీకర్ గా నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read : Pawan Kalyan : కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – పవన్