Akhanda Movie : ఆద‌రించారు విజ‌యం అందించారు

ప్రేక్ష‌కుల వ‌ల్లే ఇంత‌టి భారీ స‌క్సెస్

Akhanda Movie  : ఇవాళ సంతోషంగా ఉంది. ఎన్న‌డూ లేనంత‌గా ఆనందం క‌లుగుతోంది. దీనిని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేను. ఎంత‌టి అద్భుత‌మైన విజ‌యాన్ని అందించారో చెప్ప‌లేను అన్నారు ప్ర‌ముఖ న‌టుడు, న‌ట సింహం బాల‌కృష్ణ‌.

ఆ భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు. ఎందుకంటే కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించి పెట్టినందుకు. క‌రోనా క‌ష్ట కాలంలో ప్రేక్ష‌కులు వ‌స్తారో రారో అన్న ఉత్కంఠ‌కు తెర దించారు ప్రేక్ష‌కులు. వారు మ‌మ్మ‌ల్ని త‌ల ఎత్తుకునేలా చేశారు.

గ‌ర్వ ప‌డేలా చేశార‌ని కొనియాడారు. అఖండ విజ‌యం మామూలు విజ‌యం కాదు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఒక నూత‌న అధ్యాయానికి తెర తీసింద‌న్నారు బాల‌కృష్ణ‌. న‌డుస్తుందో లేదోన‌న్న మీమాంస‌ను పటాపంచ‌లు చేస్తూ అఖండ మూవీ(Akhanda Movie) దుమ్ము రేపింది.

ఏకంగా 50 రోజులు ఆడి రూ. 200 క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. గ్యాప్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ‌కు చెందిన నిర్మాత మిర్యాల ర‌వీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌సూళ్ల‌లో రికార్డుల‌ను తిర‌గ రాసింది.

దుమ్ము రేపింది. ఇంకా వ‌సూళ్లు రాబ‌డుతూనే ఉంది. దీంతో స‌క్సెస్ యాత్ర‌లు చేస్తోంది చిత్ర యూనిట్. 50 రోజుల సెల‌బ్రేష‌న్స్ పేరుతో కేక్ కూడా క‌ట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్, నిర్మాత‌ల‌తో క‌లిసి ఆయ‌న త‌న సంతోషాన్ని పంచుకున్నారు. మిగ‌తా సినిమాల‌ను కూడా ఆద‌రించాల‌ని కోరారు బాల‌కృష్ణ‌. ఇదిలా ఉండ‌గా ఈ మూవీకి ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ టాప్ లో నిలిచేలా చేసింది.

Also Read : కొత్త ప్రాజెక్టుల‌తో స‌మంత బిజీ

Leave A Reply

Your Email Id will not be published!