Akhil Gogoi : కేంద్రం తన పెత్తనాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే బీజీయేతర పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తోంది.
దీనిని మేం పూర్తిగా ఖండిస్తున్నాం. కుల, మతాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమైనదని అన్నారు అస్సాం ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్(Akhil Gogoi ).
ఆరు నూరైనా సరే కోవిడ్ మహమ్మారి పూర్తిగా తగ్గాక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్రకటించారు.
ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో ఈ కామెంట్స్ చేశారు. దీనిపై విపక్షాలు , మేధావులు, ప్రజాస్వామిక వాదులు భగ్గుమన్నారు.
తాజాగా గొగోయ్ నిప్పులు చెరిగారు అమిత్ షాపై. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
సీఏఏని వ్యతిరేకించడంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత ఉందని గ్రహించాలని సూచించారు. ఆయన గతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసనలకు నాయకత్వం వహించారు.
ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన మద్దతుదారులతో కలిసి మళ్లీ వీధుల్లోకి వస్తామన్నారు.
ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని కుంబ బద్దలు కొట్టారు. అస్సాం ప్రజలు ఒప్పుకోరన్నారు అఖిల్ గొగోయ్(Akhil Gogoi ).
దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుంటే చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు.
Also Read : ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం