Azam Khan : అజామ్ ఖాన్ కు అఖిలేష్ బిగ్ షాక్
సుదీర్ఘ రాజకీయ చరిత్రకు పుల్ స్టాప్
Azam Khan : యూపీలో ఆజమ్ ఖాన్ గురించి ఎవరు అడిగినా ఠకీమని చెప్పేస్తారు. తీవ్రమైన నేరారోపణలు ఆయనపై ఉన్నాయి. యూపీలో యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువు తీరాక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధానంగా నేరస్థులకు చుక్కలు చూపించారు యోగి.
ఇక ఆజమ్ ఖాన్ ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన సమాజ్ వాది పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు. అఖిలేష్ యాదవ్ తర్వాత నాయకుడిగా పేరొందారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆజమ్ ఖాన్(Azam Khan) కు కోలుకోలేని షాక్ తగిలింది.
యూపీ ఎన్నికల్లో 1977 నుంచి రామ్ పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతూ వచ్చిన అజామ్ ఖాన్ కుటుంబం 45 ఏళ్ల పాటు శాసిస్తూ వచ్చింది. పార్టీ నిర్ణయంతో పాలిటిక్స్ కు దూరమైంది. ఇది ఊహించని షాక్ అజామ్ ఖాన్ కు. ఇదిలా ఉండగా విద్వేష పూరిత కామెంట్స్ చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది.
ఇందుకు సంబంధించి ప్రజా ప్రతినిధుల కోర్టు అజామ్ ఖాన్ కు మూడేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. కోర్టు శిక్ష ఖరారు చేయడంతో తన శాసనసభ సభ్యత్వాన్ని ప్రాథమికంగా కోల్పోయారు. దీంతో రామ్ పూర్ లో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. డిసెంబర్ 5న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
కాగా అజామ్ ఖాన్ సతీమణి తంజీన్ ఫాతిమా కానీ లేదా ఆయన కోడలు గానీ పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భాయించాయి. ఊహించని రీతిలో అఖిలేష్ యాదవ్ అజామ్ ఖాన్(Azam Khan) కు షాక్ ఇచ్చారు.
ప్రస్తుత ఎన్నికల్లో అసీమ్ రజా ఖాన్ కు టికెట్ కేటాయించింది. 1997 నుంచి 2022 దాకా పదిసార్లు అజామ్ ఖాన్ గెలుపొందడం విశేషం.
Also Read : అగ్నివీర్ పేరుతో కేంద్రం మోసం – రాహుల్