Rahul Gandhi : అఖిలేష్..మాయ‌వ‌తి ద్వేషాన్ని కోరుకోరు

వాళ్లు త‌న‌తో క‌లిసి వ‌స్తార‌న్న రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారీ ఎత్తున చేప‌ట్టిన భారత్ జోడో యాత్ర‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని ఎద్దేవా చేశారు.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు జోడో యాత్ర‌లో పాల్గొనాల‌ని ఆహ్వానం అంద‌లేద‌ని పేర్కొన్నారు. దీనిపై స్పందించారు రాహుల్ గాంధీ. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు ఎవ‌రి ప‌ట్ల ద్వేషం అనేది ఉండ‌ద‌న్నారు. కాంగ్రెస్ , స‌మాజ్ వాది, బ‌హు జ‌న్ స‌మాజ్ పార్టీ లు ఒకే సామీప్య‌తతో కూడిన భావ‌జాలం క‌లిగిన పార్టీల‌ని పేర్కొన్నారు.

తాను చేప‌ట్టిన యాత్ర జ‌న‌వ‌రి 3 నుంచి ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప్రారంభం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తొమ్మిది రాష్ట్రాల‌లో పూర్తి చేశారు త‌న యాత్ర‌ను. ఇదే స‌మ‌యంలో కొద్దిపాటి విరామం తీసుకున్నారు. ఈ ఏడాది 2022 సెప్టెంబ‌ర్ 6న త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి యాత్ర‌ను ప్రారంభించారు.

త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్, హ‌ర్యానా రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది. యాత్ర‌లో భాగంగా 2,800కు పైగా కిలోమీట‌ర్ల యాత్ర జ‌రిగింది. ఈ యాత్ర యూపీ ద్వారా కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది. 789 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి ఉంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొన‌సాగే భార‌త్ జోడో యాత్ర‌లో అఖిలేష్ యాద‌వ్ , సోద‌రి మాయావ‌తి పాల్గొంటార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు రాహుల్ గాంధీ.

Also Read : క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారం

Leave A Reply

Your Email Id will not be published!