Akhilesh Mayawati Skip : యాత్ర‌కు అఖిలేష్..మాయావ‌తి దూరం

పాల్గొనాల‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఆహ్వానం

Akhilesh Mayawati Skip : దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ అంటూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇప్ప‌టికే 9 రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా రెడ్ ఫోర్డ్ నుంచి జాతిని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. ఆయ‌న చేసిన ఈ స్పీచ్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 2,800 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు రాహుల్ గాంధీ. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 6న త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్, హ‌ర్యానా రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది యాత్ర‌.

వారం రోజుల పాటు ఏర్పాట్లు చేసుకునేందుకు గాను యాత్ర‌ను నిలిపి వేశారు. తిరిగి కొత్త సంవ‌త్సరం 2023 జ‌న‌వ‌రిలో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. యూపీలో కొన‌సాగే రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొనాల‌ని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎంలు బీఎస్పీ చీఫ్ కుమారి మాయావ‌తి, స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్(Akhilesh Mayawati) తో పాటు రాష్ట్రీయ లోక్ ద‌ళ్ చీఫ్ జ‌యంత్ చౌద‌రిల‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.

కాగా ఈ ముగ్గురు నేత‌లు పాద‌యాత్ర‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా మొత్తం 150 రోజుల పాటు 3,578 కి పైగా కిలోమీట‌ర్ల మేర యాత్ర ను చేప‌ట్ట‌నున్నారు. ఇంకా 778 కిలోమీట‌ర్లు కాశ్మీర్ దాకా పాద‌యాత్ర చేప‌ట్టాల్సి ఉంది.

Also Read : కాంగ్రెస్ సీఎంల‌కు ప‌ట్నాయ‌క్ పిలుపు

Leave A Reply

Your Email Id will not be published!