Akhilesh Yadav : ఎంపీ ప‌ద‌వికి అఖిలేష్ రాజీనామా

స్పీక‌ర్ ఓం బిర్లాకు స‌మ‌ర్ప‌ణ

Akhilesh Yadav : తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎస్పీ చీఫ్ , (Former CM) మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav). త‌న రాజీనామా పత్రాన్ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఇవాళ స‌మ‌ర్పించారు.

యోగి కి నిద్ర లేకుండా చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఎస్పీ చీఫ్‌. యూపీలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి మొద‌టిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

యూపీలో ప్ర‌జ‌ల త‌ర‌పున ఉండి ప్ర‌శ్నించేందుకే తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) (Eastern Uttar Pradesh) తూర్పు యూపీలోని అజంగ‌ఢ్ నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు.

కాగా 2019 జాతీయ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాది పార్టీ 5 లోక్ స‌భ స్థానాల‌ను గెలుచుకుంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌ర్హ‌ల్ నుండి పోటీ చేసి విజ‌యం పొందారు.

ఇదిలా ఉండ‌గా 2027లో యూపీలో జ‌రిగే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని యూపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేతగా ఎదుర్కోవాల‌ని మాజీ సీఎం (Former CM) భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 403 సీట్ల‌కు గాను 273 సీట్ల‌లో బీజేపీ విజ‌య ఢంకా మోగించింది. స‌మాజ్ వాది పార్టీ 111 సీట్ల‌లో గెలుపొందింది. మిత్ర‌ప‌క్షాలు 14 సీట్ల‌లో విజ‌యం సాధించాయి.

బీజేపీ స్వంతంగా 255 సీట్లు గెలిచాయి. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి 273 గెలుపొందాయి. 2017 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాది పార్టీ 47 స్థానాల‌లో గెలుపొందగా ఈసారి ఆ సీట్ల‌ను పెంచుకుంది.

ఈసారి ఓటు శాతం పెరిగింది స‌మాజ్ వాది పార్టీ (Samajwadi Party). ఇదిలా ఉండ‌గా కాంగ్రెస పార్టీ 2 సీట్లతో ప‌రిమితం కాగా బీఎస్పీ ఒకే ఒక్క సీటుకే ప‌రిమితమైంది.

Also Read : పేద‌రికం పాపం యోగి నిర్వాకం

Leave A Reply

Your Email Id will not be published!