Dimple Yadav : జ‌యంత్ చౌద‌రికి షాక్ డింపుల్ కు ఛాన్స్

మూడు సీట్లకు ఇద్దరిని డిక్లేర్ చేసిన అఖిలేష్‌

Dimple Yadav : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన జ‌యంత్ చౌద‌రికి కోలుకోలేని షాక్ ఇచ్చారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్. నిన్న‌టి దాకా ఆయ‌న జ‌యంత్ కు రాజ్య‌స‌భ సీటు కేటాయిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

పార్టీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు చౌద‌రికి బ‌దులు త‌న భార్య డింపుల్ యాద‌వ్(Dimple Yadav) కు రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌నుంద‌ని టాక్. స‌మాజ్ వాది పార్టీకి రాజ్య‌స‌భ‌కు సంబంధించి యూపీ నుంచి 3 స్థానాలు ఉన్నాయి.

వీటిలో ఇప్ప‌టికే త‌మ త‌ర‌పు న్యాయ‌వాదిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన క‌పిల్ సిబ‌ల్ కు ఓ సీటు కేటాయించింది. ఆయ‌న దాఖ‌లు కూడా చేశారు. జావేద్ అలీఖాన్ కు ఛాన్స్ ఇచ్చారు అఖిలేష్ యాద‌వ్.

ఈ మేర‌కు నామినేష‌న్ వేశారు. ఇక మిగిలింది రెండు సీట్లు ప్ర‌క‌టించ‌గా మూడో సీటు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర‌నేది ఉత్కంఠ నెల‌కొంది. పార్టీ వ‌ర్గాల మేర‌కు జ‌యంత్ చౌద‌రికి ఆ చాన్స్ ద‌క్క‌క పోవ‌చ్చు.

అఖిలేష్ యాద‌వ్, జ‌యంత్ చౌద‌రి ఇద్ద‌రూ మంచి మిత్రులు. క‌లిసే పోటీ చేశారు ఈసారి ఎన్నిక‌ల్లో. కానీ ఆశించిన మేర ఫ‌లితాలు రాలేదు. రెండో సారి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ యూపీలో కొలువు తీరింది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌కు అవకాశం ఇస్తాన‌ని అఖిలేష్ హామీ కూడా ఇచ్చారు. కాగా ఎస్పీ మ‌ద్ద‌తుతో త‌న సొంత పార్టీ రాష్ట్రీయ లోక్ ద‌ళ్ పార్టీ అభ్య‌ర్థిగా వెళ్లాల‌ని ప‌ట్టుప‌ట్టారు.

ఇక వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో 11 స్థానాలు ఉన్నాయి.

Also Read : ఐదు నెలల్లో ఐదుగురు సీనియ‌ర్లు గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!