Akhilesh Yadav : బీహార్ లో శుభారంభం అభినందనీయం
జేడీయూ..ఆర్జేడీ పొత్తుపై అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : బీహార్ లో రాజకీయాలు ఒక్కసారిగా మారి పోయాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు గుడ్ బై చెప్పింది సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ. మరాఠా మోడల్ ను అమిత్ షా ట్రై చేస్తున్నాడని పసిగట్టిన నితీష్ ఉన్నట్టుండి మేల్కొన్నాడు.
వెంటనే తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక భేటీ ఏర్పాటు చేశాడు. ఆపై వెంటనే రాజీనామా ప్రకటించారు. ఆపై బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఆ మేరకు గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతిపక్షాలతో ఇక నుంచి పొత్తు ఉంటుందని ప్రకటించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, సీపీఐఎంల్, తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అత్యంత నమ్మకద్రోహానికి నితీశ్ కుమార్ పాల్పడ్డాడంటూ ఆరోపించారు.
ఈ తరుణంలో సీఎంగా నితీశ్ , డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ కొలువు తీరనున్నారు. తన చిరకాల మిత్రులు నితీష్ కుమార్ , తేజస్వి యాదవ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
మంగళవారం ఆయన స్పందించారు. బీహార్ లో చోటు చేసుకున్నది అభినీందనీయమని పేర్కొన్నారు. ఇదే సీన్ రేపు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా కంటిన్యూ కానుందని జోష్యం చెప్పారు.
బీజేపీ చిల్లర రాజకీయాలు ఎంతో కాలం సాగవని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్.
Also Read : కత్తుల కరచాలనం కానుందా పటిష్టం