Akhilesh Yadav : వారసత్వ రాజకీయాలపై తరుచూ ఆరోపణలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. యూపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపింప చేస్తున్నాయి.
ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఎంఐఎం, ఆప్ తో పాటు ఇతర పార్టీలు సైతం బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
కుటుంబ వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరంటూ అమిత్ షా అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై అఖిలేష్ యాదవ్ సీరియస్ గా స్పందించారు.
ఏం అర్హత ఉందని నీ తనయుడికి బీసీసీఐ పోస్ట్ దక్కిందని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎంతో మంది అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని, మాజీ ఆటగాళ్లు లేదా క్రికెట్ తో అనుబంధం ఉన్న వారు లెక్కల కొద్ది ఉన్న తరుణంలో జే షా ఒక్కడికే ప్రధాన పోస్ట్ ఎలా చేజిక్కిందో ఓసారి అమత్ షా ఈ దేశానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఉన్న సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే సహకార మంత్రిగా కూడా కొనసాగుతుండడం మీకే చెల్లిందన్నారు. కర్ణాటకలో సీఎంగా ఉన్న బొమ్మై ఎవరి కొడుకో చెప్పాలన్నారు.
అది వారసత్వ రాజకీయం కాదా ఇది మీకు కనిపించడం లేదా అని మండిపడ్డారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav ). సొంత పార్టీలోనే వారి వారసులు ఎందరో ఉన్నారని దానిని గుర్తించకుండా మాపై బురద చల్లాలని చూస్తే ఊరుకో బోమన్నారు.
దగ్గరి బంధువు కావడం వల్లనే యోగి గతంలో గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఎదిగారని సంచలన ఆరోపణలు చేశారు.జ్యోతిరాదిత్యా సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలో ఉన్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు.
Also Read : ప్రచారంపై ఉన్న శ్రద్ద ప్రమాదంపై లేదు