Akhilesh Yadav : ఇంకెంత కాలం మౌనంగా ఉంటారు
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఇంకెంత కాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఓ వైపు మణిపూర్ రాష్ట్రం తగలబడి పోతుంటే అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు . గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన సంజయ్ సింగ్ ను పరామర్శించారు.
Akhilesh Yadav Asking
తమ పార్టీ ఆయనకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. మణిపూర్ పై మోదీ సమాధానం చెప్పాలని అన్నందుకు పార్లమెంట్ నుంచి సస్పెండ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). ఇది రాచరికపు పాలనను గుర్తుకు తెస్తోందన్నారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసను, అల్లర్లను కంట్రోల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు అఖిలేష్ యాదవ్.
ఓ వైపు అల్లర్లతో అట్టుడుకుతుంటే బాధ్యత వహించాల్సిన ప్రధాన మంత్రి మౌనంగా ఎలా ఉంటారంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. దేశం యావత్తు మోదీని దోషిగా చూస్తోందన్నారు అఖిలేష్ యాదవ్.
బీజేపీ ఓట్ల రాజకీయాల కారణంగా మణిపూర్ ప్రస్తుతం దిక్కులేనిదిగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలకు , కేంద్ర సర్కార్ కు అన్నీ తెలిసినా మిన్నకుండి పోవడం వెనుక గల కారణాలు ఏమిటో చెప్పాలని అన్నారు .
Also Read : RS Praveen Kumar : హోం గార్డులపై కేసీఆర్ వివక్ష