Akhilesh Yadav : మోదీకి మూడింది – అఖిలేష్
ప్రధాన మంత్రికి అంత సీన్ లేదు
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ముంబై లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
Akhilesh Yadav Comments on PM Modi
ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటైన ఇండియా కూటమి ఇప్పుడు అసలైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం వ్యాపారస్తులకు లాభం చేకూర్చేలా మోదీ చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ దేశం తీవ్రమైన సంక్షోభంలో నెలకొందన్నారు.
దేశం పీకలలోతు అప్పుల్లోకి కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). కేవలం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా ఇప్పటి దాకా మోదీ పని చేశారంటూ ఆరోపించారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు .
దీనిని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సిద్దమైందని చెప్పారు. ఇందులో భాగంగానే దేశంలోని కీలకమైన పార్టీలన్నీ ఏకమయ్యాయని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తమ కూటమి ఇక నుంచి యుద్దం చేస్తుందన్నారు అఖిలేష్ యాదవ్. పవర్ లోకి వచ్చేంత దాకా ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు.
Also Read : India Alliance : 30 లోగా సీట్ల షేరింగ్