Akhilesh Yadav Rahul : రాహుల్ ఆహ్వానం అఖిలేష్ సంతోషం
యాత్రలో పాల్గొనే దానిపై క్లారిటీ ఇవ్వని నేత
Akhilesh Yadav Rahul : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు ఆహ్వానం పంపారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు తాను పంపిన ఇన్విటేషన్ ను ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల రాహుల్ చేపట్టిన యాత్రలో తనకు ఆహ్వానం అందలేదని బహిరంగంగానే కామెంట్ చేశారు.
అది చర్చకు దారి తీసింది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చేసిన వ్యాఖ్యల గురించి ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రశ్నించింది మీడియా. దీనికి చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు అగ్ర నాయకుడు. కాంగ్రెస్ , ఎస్పీ, బీఎస్పీతో పాటు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించామని, ఒకవేళ అందకపోతే మరోసారి కూడా పంపిస్తామని చెప్పారు.
ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలు తమకు సోదర పార్టీలని, అఖిలేష్ యాదవ్ కానీ లేదా బీఎస్పీ చీఫ్ మాయావతి కానీ వాళ్లు ద్వేషాన్ని కోరుకోరని ప్రేమను ఆహ్వానిస్తారని అన్నారు. అంతే కాదు వారు తప్పకుండా తాను చేపట్టే భారత్ జోడో యాత్రలో యూపీలో పాల్గొంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ఈ తరుణంలో ఇవాళ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపడం పట్ల అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) స్పందించారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు కూడా తెలిపారు. భారత్ జోడో యాత్ర సక్సస్ ఫుల్ గా సాగుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ దేశం అనేది విస్తరణ కంటే ఎక్కువ అనుభూతి కలిగినదని పేర్కొన్నారు.
అహింస, కరుణ, సహకారం , సామరస్యం మాత్రమే దేశాన్ని ఏకం చేస్తాయన్నారు. అయితే తాను పాల్గొంటారా లేదా అన్నది ఇంకా స్పష్టం చేయలేదు.
Also Read : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి