Akunuri Murali : అన్ని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలి

చైర్మ‌న్ తో స‌హా అంద‌రినీ అరెస్ట్ చేయాలి

Akunuri Murali TSPSC : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై సిట్ కాకుండా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్న త‌రుణంలో సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోర‌మ్ చీఫ్ , మాజీ ఏఐఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి(Akunuri Murali TSPSC) సీరియ‌స్ గా స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లీకులు..స్కాంలు..అక్ర‌మాలు..అత్యాచారాలు..మోసాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఏ ఒక్క ప‌రీక్ష స‌క్ర‌మంగా నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. తాజాగా టీఎస్పీఎస్సీలో చోటు చేసుకున్న పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం వెనుక ఎవ‌రు ఉన్నార‌నే దానిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆకునూరి ముర‌ళి. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల ఆశ‌ల‌పై టీఎస్పీఎస్సీ నీళ్లు చ‌ల్లింద‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ చైర్మ‌న్ , సెక్ర‌ట‌రీతో పాటు స‌భ్యుల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల‌తో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించ బోయే అన్ని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని అన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali). లేక పోతే ఇలాంటి అక్ర‌మాలు మ‌రికొన్ని జ‌రిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. అత్యంత దుర్మార్గ‌మైన పాల‌న‌కు సంకేతం ఈ లీకు వ్య‌వ‌హారం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్.

ఆకునూరి ముర‌ళి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : సిట్ కాదు జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!