Akunuri Murali : ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే తన్నండి
పిలుపునిచ్చిన ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్ ఆకునూరి మురళి(Akunuri Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఎన్నికలు ముగిశాయని, ఇక పోలింగ్ కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పౌర సమాజం, ముఖ్యంగా నాలుగున్నర కోట్ల ప్రజానీకంతో పాటు యువత , నిరుద్యోగులు , మహిళలు అత్యంత జాగ్రత్తతో ఉండాలని సూచించారు .
Akunuri Murali Serious Comments
ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సంపదను దోచుకున్న భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన దొంగలు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని అందుకే అత్యంత జాగ్రత్తతో ఉండాలన్నారు ఆకునూరి మురళి.
వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోందని అలాంటి దొంగలను తన్ని తరిమేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమ్ముడు పోయే ఎవరైనా సరే వారిని వెంట పడి తరమాలని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని స్పీకర్లు, గవర్నర్ల మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆయన జాగో తెలంగాణ పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆయన మొదటి నుంచీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న మోసాలను ఎండగడుతూ వచ్చారు.
Also Read : Election Commission : ఈసీ సంచలన నిర్ణయం