Akunuri Murali : సీఎం తెలంగాణకు శాపం
ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. జాగో తెలంగాణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Akunuri Murali Slams KCR
రాష్ట్రంలో ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షలకు పైగా జాబ్స్ ఉన్నాయని నివేదించింది. అయినా తొమ్మిదిన్నర ఏళ్లుగా అవినీతి, అక్రమాలకు పాల్పడేందుకే సమయం సరి పోయింది ఇక పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
సిగ్గు లేకుండా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, దశల వారీగా జాబ్స్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేటీఆర్ చెప్పడం దారుణమని పేర్కొన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali). అబద్దాలతో , మోసాలతో దుర్గార్మపు , రాక్షస పాలన సాగిస్తున్న కేసీఆర్ దొర కుటుంబానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తండ్రీ కొడుకులు ఇప్పుడు అధికారం పోతుందేమోనన్న ఆందోళనతో లేనిపోని హామీలు ఇస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండక పోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
Also Read : CM KCR : కంపెనీల కాన్ దాన్ తెలంగాణ