Akunuri Murali : గద్దరన్నను అవమానించిన కేసీఆర్
ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి
Akunuri Murali : మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి(Akunuri Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దివంగత ప్రజా గాయకుడు, ప్రజా యుద్ద నౌక గద్దర్ ను కేసీఆర్ కావాలని అవమానించాడని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు బయట కూర్చున్న ఫోటోను షేర్ చేశారు.
Akunuri Murali Comments
ఈ ఏడాది 2023 ఫిబ్రవరి 28న ప్రగతి భవన్ కు వెళ్లారు గద్దర్. అక్కడ ఎండలో చాలా సేపు గేటు బయట కూర్చున్నాడని తెలిపారు. రెండు సార్లు సీఎం కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. అయినా సీఎం మనసు కరగలేదన్నారు. బతికి ఉన్నప్పుడు కలిసేందుకు ఇష్ట పడలేదని, కావాలని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి.
గద్దరన్న చని పోయాక అధికారిక లాంఛనాలు అని ప్రకటించాడని, తర్వాత తనపై ఉన్న అపవాదు లేకుండా చేసుకునే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. చివరకు గత్యంతరం లేక తెలంగాణ సమాజం ఛీత్కరిస్తుందని భయపడ్డాడని, గద్దరన్న భౌతిక కాయాన్ని సందర్శించాడని పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఓట్ల కోసం తప్ప మరొకటి కాదని ఆకునూరి మురళి స్పష్టం చేశారు.
Also Read : CM KCR : కేసీఆర్ ను తిట్టినోళ్లు తిరిగి వస్తున్నరు